5 May, 2026 | 2:02 AM

వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

05-05-2026 12:00 AM

మహబూబాబాద్, మే 4 (విజయక్రాంతి): పిడుగుపాటుకు గురై అకాల మృత్యువాత పడ్డ సూదనపల్లి గ్రామ రైతు నీలం వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో వెంకన్న పార్టీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

కుటుంబ సభ్యులను ఓదార్చి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్ళు సకాలంలో పూర్తికాక రైతులు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు.