15 April, 2026 | 8:07 AM

అదుపుతప్పి వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

23-02-2026 10:28 AM

20 మందికి తీవ్ర గాయాలు.. తప్పిన పెను ప్రమాదం... 

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం(Utnoor Mandal) షాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆదిలాబాద్ డిపోకు(Adilabad Bus Depot) చెందిన ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుండి మంచిర్యాల వైపు వెళుతుండగా షాంపూర్ గ్రామ సమీపంలోని ఆడపుతప్పి వంతెన పై నుండి వాగులో పడిపోయింది.. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ లో  ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.