పొదల్లోకి దూసుకెళ్లిన పల్లె వెలుగు బస్సు.. తప్పిన పెనుప్రమాదం
05-06-2024 11:06 AM
తంగళ్ళపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు స్టీరింగ్ లాక్ కావడంతో అదుపుతప్పి చెట్ల పొదల్లోంచి దూసుకెళ్లింది. బస్సు తెల్లవారుజామున 5.30 గంటలకు సిద్దిపేట డిపో నుంచి బయలుదేరినట్లు కండక్టర్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. డ్రైవర్ నిర్ల్యక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలపైనట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






