బీజేపీ 8 మంది విజేతల్లో ఇద్దరు కరీంనగర్ వారే
05-06-2024 02:17 AM
కరీంనగర్, జూన్ 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలిగింటి లో బలముండగా మరో 4 స్థానాలను పెంచుకుంది. గెలుపొందిన 8 మందిలో ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందినవారు కావడం విశేషం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ రెండోసారి గెలుపొందగా, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఈటల రాజేందర్ తొలిసారి ఎన్నికయ్యారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తోపాటు గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎంపీగా 3 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడం విశేషం.






