24 April, 2026 | 7:28 PM

Breaking News

ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి

24-04-2026 05:54 PM

 - ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ 

ముకరంపుర,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు అల్ ఇండియా  ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వారి న్యాయమైన  డిమాండ్స్ ల  కోసం చేస్తున్న పోరాటాల్లో పాల్గొంటామని జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఆర్టీసీ కార్మికుడి మృతిని ప్రభుత్వ హత్యగా భావించాలి అని తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.