28 July, 2026 | 1:06 PM

Breaking News

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •  

ఆ బికినీ వీడియో నాది కాదు!

24-05-2026 01:47 AM

కన్నడ, తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద తాను బికినీతో ఫోటోషూట్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలన్నీ నకిలీవని స్పష్టం చేసింది. ఏఐని ఉపయోగించి తన రూపంతో ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించారంటూ బాధ్యులపై తీవ్రంగా మండిపడింది.

ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించిన రుక్మిణి.. “ఏఐ సాయంతో మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఇది ఒకరి వ్యక్తిగత గోప్యతను దారుణంగా ఉల్లంఘించడమే. ఈ ఫేక్ కంటెంట్‌ను తయారుచేసిన వారితోపాటు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కూడా సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా కఠిన న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం” అని పేర్కొంది రుక్మిణి. ఇదిలావుండగా.. ఇక సినిమా, పబ్లిక్ ఈవెంట్స్‌కు హాజరయ్యే హీరోయిన్లు, నటీమణులను అభ్యంతర కర రీతిలో ఫొటోలు తీయడంపైనా రుక్మిణీ వసంత్ గతంలోనూ మండిపడింది. జూమ్ చేసి మరీ తమ శరీరాలను ఫొటోలు తీయాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది రుక్మిణి.