నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి
సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాదులో సోమవారం నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న బోత్ శాసనసభ్యులు జాదవ్ అనిల్ ఆస్పత్రి లో వసతుల కల్పనతో పాటు పలు మండలాలలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి భవనం నిర్మించి సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు.
అందులో స్టాప్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రత్యేక వైద్యులు ఉండాల్సిన అవసరం ఉందని ఆయా పోస్టులను కేటాయించాలని మంత్రికి విన్నవించారు.టీఎస్ ఎంఎస్ఐడిసి ద్వారా ప్రాధాన్యత పరికరాలు లేకపోవడం వల్ల సేవలు ప్రారంభించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను 30 పడకల ఆసుపత్రిగా ఆఫ్ గ్రేడ్ చేయాలని కోరారు. 45 వేల మంది జనాభాకు ఒకే ఒక ఆసుపత్రి ఉందని పేర్కొన్నారు. సరైన వసతులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు గురవుతున్నారు.అన్నారు.
నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరు కోట్ల అంచనాలతో ఇన్ పేషంట్ భవనం మంజూరు చేయాలని మంత్రి విన్నవించారు .80 శాతం గిరిజన కుటుంబాలు ఉన్నాయని వారికి ఆసుపత్రిలో సరైన వసతులు లేక వైద్యం ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. లేబర్ రూమ్ మంజూరు చేయాలని సూచించారు. బోత్ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు అందుబాటులో లేకపోవడంతో బోత్ ఇచ్చోడ మండలాల నుండి వారానికి రెండు మూడుసార్లు ఆదిలాబాద్ ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారని దాదాపు 50 కి పైగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికంగా డయాలసిస్ సెంటర్ లేక పోవడం వల్ల పేద మధ్యతరగతి రోగులు చికిత్సను మధ్యలోనే ఆపేస్తున్నారని మంత్రికి వివరించారు.ఆయా మండలాలలో డయాలసిస్ సెంటర్లు వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలన్నారు. నేషనల్ హైవే 44 పైన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని, అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి అన్నారు. అయితే ప్రజల అవసరాల నిమిత్తం 108 అంబులెన్స్లను మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తో పాటు కమిషనర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.






