calender_icon.png 2 November, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరన్ మ్యాన్ స్మృతిలో రన్ ఫర్ యూనిటీ

01-11-2025 12:00:00 AM

 జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసుల క్రీడోత్సాహం

శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): దేశ తొలి ఉప ప్రధాని సర్థార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఏక్తా దీవస్ సందర్బంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మనమంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలి ఐక్యతే బలం అనే థీమ్తో 2 కిలోమీటర్ల ప్రతీకాత్మక పరుగును మాధాపూర్ టీ-హబ్ గేట్ వద్ద నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాధాపూర్ డీసీపీ రితిరాజ్, ఐపీఎస్ శుభారంభం చేశారు. ఐక్యత, దేశభక్తి, సమన్వయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది పోలీసు సిబ్బంది, సిసిఎసి సభ్యులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సర్దార్ పటేల్ భారతీయ రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన దృఢసంకల్పం, నాయకత్వం ఈరోజు కూడా మనందరికీ ప్రేరణ.

గెలుపు కంటే పాల్గొనడమే ముఖ్యమని, ఏ పనినైనా పూర్తి చేయడం అంతే విలువైనదని గుర్తించాలి. మనం పరుగెత్తింది ఐక్యత కోసం నిలబడేది కూడా ఐక్యతకోసమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ దేశ సమైక్యతా శిల్పి పటేల్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని 562 సంస్థానాలను ఏకం చేసి భారత గణరాజ్యానికి బలమైన పునాది వేశారని రితిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధాపూర్ ఏడీసీపీ ఉదయ్రెడ్డి, ఏసీపీ చి. శ్రీధర్, మియాపూర్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్, మాధాపూర్ జోన్ ఇన్స్పెక్టర్లు, సిసిఎసి సీఈఓ నావేద్ ఖాన్, ప్రాజెక్ట్ మేనేజర్ భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు.