calender_icon.png 1 November, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వనిత ఇందిరాగాంధీ

01-11-2025 12:00:00 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 

కామారెడ్డి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): భారతదేశ కీర్తిని  ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహిళ నేత ఇందిరాగాంధీ అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేశారు. భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా  కామారెడ్డి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారని అన్నారు,

ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.  ఇందిరాగాంధీ  దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు.  దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారని అన్నారు.

ఇందిరా గాంధీ భారతదేశ ఏకైక మహిళా ప్రధానమంత్రిగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు. ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, తాజా మాజీ కౌన్సిలర్లు, శంకర్ రావు, జూలూరి సుధాకర్, సాయిబాబా, మామిళ్ళ రమేష్, మహేష్, తాటి ప్రసాద్, రంగ రమేష్ గౌడ్, నర్సిల్ల  మహేష్, యూత్ నాయకులు పాల్గొన్నారు.

మద్నూర్లో కాంగ్రెస్ నేతల ఘన నివాళులు..

బిచ్కుంద, అక్టోబర్ 31 (విజయ క్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి, ఐరన్ లేడీ ఇందిరా గాంధీ  వర్ధంతి సందర్భంగా.. మద్నూర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం శుక్రవారం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఇందిరా గాంధీ  పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. దేశం కోసం త్యాగం చేసి, ప్రజలకు అంకితభావంతో పనిచేసిన నాయకురాలిని దేశం ఎప్పటికీ మరవదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మ చూపించిన ప్రజాసేవ మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారస్ సాయిలు, రామ్ పటేల్, , రమేష్ సీనుపటేల్, విట్టాల్ గురిజి, కొండ గంగాధర్, రమేష్ వట్నల్ వార్, ప్రజ్ఞకుమార్, హన్మంత్ యాదవ్, హన్మాండ్లు స్వామి, బండి గోపి, రాములు, ఆముల్, రవి పాల్గొన్నారు.