12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల పరుగు
17-06-2024 01:28 AM
- 52 ఏండ్ల మారథాన్ బామ్మ రికార్డు
న్యూఢిల్లీ, జూన్ 16: మనిషి 40 ఏండ్లకే మోకాళ్ల నొప్పులతో నడవలేకపోతున్నాడు. అలాంటిది 52 ఏండ్ల ఓ బామ్మ పరుగులో ప్రపంచ రికార్డే సృష్టించారు. 12 రోజుల్లోనే ఏకంగా ౧,౦౦౦ కి.మీ. దూరం పరుగెత్తి ఔరా అనిపించారు. నటాలీ డావు అనే మహిళ వెటరన్ మారథాన్ రన్నర్. ఇటీవల థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ దేశాల్లో 12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. కాళ్లకు బొబ్బలెక్కే ఎండను లెక్క చేయకుండా ఈ ఫీట్ సాధించటం విశేషం. అంతేకాదు ఆమెకు తుంటి భాగంలో తీవ్రగాయమైంది. దేన్నీ లెక్కచేయకుండా రోజుకు రెండు మారథాన్‌లకు సమానమైన దూరం ఆమె పరుగెత్తారు. ఆ పరుగు ఈ నెల 5న సింగపూర్‌లో ముగిసింది. అత్యంత వేగంగా వెయ్యి కి.మీ. పరుగును పూర్తిచేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించారు.






