16 July, 2026 | 8:37 PM

మా మధ్య పొరపొచ్చాలు లేవు

17-06-2024 01:31 AM
  • ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భాగవత్ స్పష్టత

గోరఖ్‌పూర్, జూన్ 16 : లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధించకపోవడంతో ఆరెస్సెస్, బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయని వదంతులు వినిపించాయి. ఈ విషయంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం స్పష్టతనిచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఈ ప్రచా రం అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పర్యటనలో ఉన్న ఆయన.. 2025 నాటికి ఊరూరికి వెళ్లి ఆరెస్సెస్ భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాలంటీర్లకు సూచించారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి దేశ నిర్మాణానికి ఆరెస్సెస్ చేస్తున్న నిస్వార్థ సేవ గురించి ప్రజలకు తెలియజేయడానికి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాలని కోరనున్నారు. యోగి స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో భాగవత్ పర్యటన నేపథ్యంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. 2025 నాటికి ఆరెస్సెస్ ప్రారంభమై 100 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామానికి చేరుకోవాలని, భారత సంస్కృతి, విలువలను ప్రతి ఒక్కరికి వివరించాలని పిలుపునిచ్చారు.