2 July, 2026 | 12:21 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

మరింత క్షీణించిన రూపాయి

03-01-2025 12:00 AM

నూతన కనిష్ఠస్థాయి 85.75 వద్ద ముగింపు

ముంబై, జనవరి 2: ఈక్విటీ మార్కెట్ భారీగా పెరిగిన రోజున కూడా రూపాయి పతనం కొనసాగింది. డాలర్ బలోపేతంకావడం, ఇతర వర్థమాన కరెన్సీలు క్షీణించడం తో ఇదేబాటలో రూపాయి పయనించింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ మరో 11 పైసలు క్షీణించి 85.75 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో ఇది 85.79 కనిష్టస్థాయిని తాకింది. డిసెంబర్ 27న రూపాయి 85.80 ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ, ఆ రోజున రూపా యి విలువ 85.53 వద్ద ముగిసింది. కానీ 85.75 స్థాయి వద్ద ముగియడం ఇదే ప్రధ మం. 2024 సంవత్సరంలో పలు దేశాల కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలపడిందని, ఇదే పటిష్ఠత కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్నదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.

వడ్డీ రేట్ల కోతలపై ఫెడరల్ రిజర్వ్ అంచనాలు తగ్గడం, ట్రంప్ పాటించ బోయే వాణిజ్య విధనాలపై అంచనాలతో డాలర్ ఇండెక్స్, యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయని, దీనితో రూపాయి విలు వ క్షీణిస్తున్నదని ట్రేడర్లు తెలిపారు.డాలర్ పటిష్ఠతను తెలిపే డాలర్ ఇండెక్స్ తాజాగా రెండేం డ్ల గరిష్ఠస్థాయి 108.45 వద్ద ట్రేడవుతున్నది. 

పతన క్రమం ఇలా..

ఈ ఏడాది అక్టోబర్ 10న రూపాయి కీలకమైన 84 స్థాయిని కోల్పోగా, డిసెంబర్ 19న 85 స్థాయి దిగువకు జారిపోయింది. డిసెంబర్ 27న ఇంట్రాడేలో గత రెండేండ్లలో ఎన్నడూచూడనిరీతిలో పతనమై 85.80 ఆల్‌టైమ్ కని ష్టాన్ని తాకింది. డాలర్ బలం, క్రూడ్ ధరల పెరుగుదల, దిగుమతిదార్ల నుంచి డాలర్ల డిమాండ్ తదితర అంశాలతో సమీప భవిష్యత్తులో రూపాయి బలహీనంగానే ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. సమీప భవిష్యత్తులో డాలర్/రూపీ పెయిర్ 85.50 86 రేంజ్‌లో కదలవచ్చని అంచనా వేశారు.