calender_icon.png 9 November, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

09-11-2025 10:07:13 AM

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న అర్థరాత్రి వరకు 80,560 మంది భక్తు స్వామివారిని దర్శించుకోగా, 35,195 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. అలాగే నిన్న శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.22 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.