09-11-2025 01:09:29 AM
నాగర్‌కర్నూల్, నవంబర్ 8 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు ఆరు రోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడి రోగులకు నరకయాతన అనుభవించారు. ఈ అంశంపై శనివారం ‘అంధకారంలో ఆరోగ్య కేంద్రం’ అనే శీర్షికన విజయక్రాంతి దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. దీంతో జిల్లా విద్యు త్ శాఖ అధికారి వెంకట నరసింహారెడ్డి స్పం దించి, తక్షణమే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని విద్యుత్ ఏఈని ఆదేశించడంతో శనివారం రాత్రి విద్యుత్ పునరు ద్ధరించారు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.