calender_icon.png 9 November, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు, ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

09-11-2025 10:32:35 AM

సంగారెడ్డి: కంది మండలం కవలంపేట వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కవలంపేట వద్ద వేగంగా దూసుకోస్తున్న ఎస్యూవీ వాహనం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.  మృతుడు బాలయ్య (45)గా, గాయపడిన వారిలో ప్రవీణ్, ఫరీద్, సీతారాం, కలప్ప, మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు పేర్కొన్నారు.