16 July, 2026 | 8:21 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

12-06-2024 12:15 AM

ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, దీనికి హీరో విశ్వక్‌సేన్, దర్శకుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ “సీస్పేస్ అనే సంస్థ ద్వారా ప్రతిభావంతులైన యువతకు నవదీప్ ఒక మంచి వేదికను ఏర్పాటు చేశారు. నేను నటించి గౌరవించే వాళ్లలో చాందిని చౌదరి ఒకరు.

ఈ సినిమాకి సంగీతం, ఎడిటింగ్ విభాగాల్లో మహిళలు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు ఉండాలనేది నా కోరిక. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చటేసింది. తప్పకుండా ఈ చిత్రం అందరికి మంచి బ్రేక్‌నివ్వాలి” అన్నారు. నవదీప్ మాట్లాడుతూ “నిజాయితీగా చేసిన సినిమా ఇది. చాందిని చౌదరి ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తూ, వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలని తపిస్తుంటుంది. తప్పకుండా ఈ చిత్రం చాందిని కెరీర్‌లో దిబెస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

అనంతరం దర్శకుడు ప్రకాశ్ దంతులూరి మాట్లాడుతూ “నా కథను, పాత్రను నమ్మి ఈ సిని మా చేసింది చాందిని. నాకు ఈ సినిమా విషయంలో నవదీప్ సపోర్ట్ వుంది. ప్రతి విషయంలో ఆయన నాతో వున్నాడు. కీర్తన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు నేను ఊహించిన దానికంటే బెటర్ అవుట్‌పుట్ ఇచ్చారు. అందరి సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్. తప్పకుండా అందరికి నచ్చుతుందే నమ్మకం వుంది” అన్నారు.