20 April, 2026 | 9:24 PM

Breaking News

డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర   •   యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు   •   చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •  

1,93,851 మంది రైతులకు ‘భరోసా’

20-06-2025 08:45 PM

జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల..

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme)లో మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 1,93,851 మంది రైతులకు ఎకరానికి 6 వేల చొప్పున ఇప్పటివరకు 202.49 కోట్ల రూపాయలు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల(District Agriculture Officer Vijaya Nirmala) తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడిఏలు శ్రీనివాసరావు, మురళిలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.

జిల్లాలో రైతులకు రైతు భరోసా పథకం క్రింద 2025 వానాకాలం సీజనుకు గాను 20వ తేదీ వరకు 202.49 కోట్లు, 1,93, 851 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో 22, 108 మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ రైతులకు 30.24 కోట్లు రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సహాయం – రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కలుపు మందులు కొనుగోలుకు సక్రమంగా వినియోగించుకోవడానికి అందించడం జరిగిందన్నారు. వానాకాలం పంటల సాగుకు ముందే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.