calender_icon.png 2 November, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో త్వరలోనే సదర్ వేడుకలు

01-11-2025 06:25:24 PM

శ్రీకృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల శ్రీధర్ యాదవ్

గోదావరిఖని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో త్వరలోనే సదర్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల శ్రీధర్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మొట్టమొదటిసారిగా గోదావరిఖనిలో సదర్ వేడుకలు ప్రారంభించామని, ఈ ఏడు కూడా మన యాదవుల కోరిక మేరకు మళ్లీ గోదావరిఖనిలో యాదవుల సహకారంతో పెద్దఎత్తున సదర్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీధర్ యాదవ్ తెలిపారు. ఈ సదర్ వేడుకలకు జిల్లాలోని, గోదావరిఖనిలోని యాదవులు సహాయక సహకారాలు అందించాలని ఆయన ప్రకటనలో కోరారు.