01-11-2025 06:18:27 PM
గ్రామపంచాయతి భవన నిర్మాణానికి భూమి పూజ
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తోనే ఖానాపూర్ గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం ఖానాపూర్ గ్రామ పంచాయతి కార్యాలయ భవన నిర్మాణానికి సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గ్రామ ప్రజలతో కలిసి భూమి శనివారం పూజ చేశారు. గ్రామ పంచాయతి భవన నిర్మానానికి రూ.20లక్షల మంజూరయ్యాయని, అంతేగాకుండా ఎల్ మడుగును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఖానాపూర్ పిడబ్ల్యు రోడ్ నుంచి రుద్ర పాదాల వరకు రూ.7 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని అన్నారు.
అనంతరం చైర్మన్ కొత్త శ్రీనివాస్ ను మాజీ ఎంపిపి నారమల్ల లక్ష్మి రాజం, తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే నారమల్ల లక్ష్మి రాజం ను నాయకులు, గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు సేమంతుల ఓదెలు, దొరగోర్ల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు తోట సుధాకర్, నాయకులు బాస అశోక్, మంథని సమ్మయ్య, పెగడ రాజు, మాదర వెంకటేష్, రంగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.