2 August, 2026 | 5:55 AM

భద్రతా ప్రమాణాలు పాటించాలి

29-10-2024 03:50 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): దీపావళిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే క్రాకర్స్ దుకాణదారులు ప్రమాదాల రహితంగా భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలను పాటిచాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణం, ఆ పక్కనే దగ్ధమైన టిఫిన్ సెంటర్‌ను ఆయన సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. టపాసుల దుకాణదారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బహిరంగ ప్రదేశాల్లోనే క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు.