26 June, 2026 | 9:31 PM

సాయ్, సంగారెడ్డి ముందంజ

16-06-2024 12:05 AM
  • రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీ

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), రంగారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి జట్లు ముందంజ వేశాయి. నవశక్తి క్రీడా మండల్ ఆధ్వర్యంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో గౌలిపురలో జరుగుతున్న ఈ టోర్నీలో సాయ్ జట్టు 36 తేడాతో మహబూబ్‌నగర్ టీమ్‌పై విజయం సాధించింది. సాయ్ జట్టు తరఫున లక్ష్మణ్, రాజు రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 33 వరంగల్‌పై, సూర్యాపేట 37 కృష్ణ క్లబ్‌పై, సంగారెడ్డి 30 వరంగల్‌పై విజయాలు సాధించాయి. నేడు ఫైనల్ నిర్వహించనున్నారు.