22 August, 2026 | 8:19 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం స్వాధీనం

26-06-2026 09:09 PM

నాగర్‌ కర్నూల్,(విజటాక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా ఆబ్కారీ అధికారి వి. వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాగర్‌ కర్నూల్ ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. తాడూర్ మండలం పాపగల్ గ్రామానికి చెందిన ఎం.డి. అన్వర్ కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా, నాటుసారా తయారీకి వినియోగించే 600 కిలోల నల్లబెల్లం, 50 కిలోల నవసాగరం, పటిక స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎం.డి. అన్వర్‌పై కేసు నమోదు చేసినట్లు అబ్కారీ సీఐ కళ్యాణ్ తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐలు చిన్న రాములు, నవీన్ రెడ్డి, సిబ్బంది బంతిలాల్, నిరంజన్, సత్యనారాయణ గౌడ్, అరుణ్ కుమార్, దయాకర్, మౌనిక పాల్గొన్నారు.