భద్రాద్రి రామాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం
26-06-2026 09:15 PM
శనివారం ఉదయం అధికారికంగా ప్రారంభించనున్న కాంట్రాక్టర్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం రామాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఉన్న నిర్మాణం శనివారం ఉదయం నుండి చేపట్టడానికి సంబంధిత నిర్మాణ సంస్థ అధికారులు శుక్రవారం సాయంత్రం దేవస్థానం అధికారులను సంప్రదించారు. తొలుత దేవాలయంలో పూజలు నిర్వహించిన నిర్మాణ సంస్థ అధికారులు రామాలయం ఈవో దామోదర్ రావు తో కలిసి ఆలయం లో తిరిగి నిర్మించాల్సిన వివిధ పనులను గురించి చర్చించారు. 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనుండగా ఇందుకు సంబంధించిన సాంకేతికపరమైన అంశాలను ప్రాథమికంగా పరిశీలించారు ఈ పనులను శనివారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు.






