4 June, 2026 | 1:14 AM

రెండో రోజు ఉత్కంఠ భరితంగా సెయిలింగ్ చాంపియన్ షిప్

04-06-2026 12:34 AM

ముషీరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్ రెండో రోజు పోటీలు హుస్సేన్ సాగర్ లో ఉత్కంఠ భరితంగా సాగాయి. భారీ ఈదురు గాలుల మధ్య జరిగిన రేసుల్లో ఇంటర్నేషనల్ 420 మికస్డ్ క్లాస్లో చంద్రలేఖ తట్టారి-ధనుష్ జక్కుల జోడీ వరుసగా రెండు రేసుల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బద్రీనాథ్ నిరుడు-రిశ్వింత సుంచనకోట ద్వయం రెండో స్థానంలో కొనసాగుతోంది.

29ఇఆర్ విభాగంలో వినోద్ దండు-అరవింద్ మాలోత్ జోడీ మూడు రేసుల్లో రెండింటిని గెలిచి పట్టికలో ముందంజలో ఉంది. ఐఎల్సీఏ4 అండర్-18 బాలుర విభాగంలో ప్రీత్ సివాల్ తొలి స్థానంలో నిలవగా, బాలికల విభాగంలో కాత్యాయని కౌశిక్ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇదిలా ఉండగా, టాప్ సీడ్ సెయిలర్ దీక్షిత కొమరవెల్లి బోటు తిరగబడటంతో భుజానికి గాయమై టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు.