విద్యార్థుల నమోదును వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
కామారెడ్డి, జూన్ 3 (విజయక్రాంతి): పాఠశాలలలో కళాశాలలో విద్యార్థుల నమోదును వేగవంతం చేయాలని ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ, అభినవ్ అభిలాష విద్యా శాఖ సెక్రటరీ యోగితారాణా , డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలిన్, హయ్యర్ ఎడ్యుకేషన్ దేవసేన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంలతో కలసి పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట ప్రవేశాల ప్రత్యేక కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs), మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
భవిత కేంద్రాల బలోపేతం, కొత్త ప్రీ-ప్రైమరీ విభాగాల ప్రారంభం, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల పునఃప్రారంభం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, AXL, AI-Pi-Jam వంటి వేదికల వినియోగాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ సకాలంలో పంపిణీ చేయడంతో పాటు, సెర్ప్ బృందాల ద్వారా యూనిఫార్ముల కుట్టింపు ,పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణతో పాటు రోజువారీ పురోగతి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో సూచించారు.






