వాట్సాప్ కాల్స్ రికార్డ్‌పై సజ్జనార్ క్లారిటీ
04-06-2026 12:36 AM
సికింద్రాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): వాట్సప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయన్న వార్తల లో ఏమాత్రం నిజం లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కొందరు ఆకతాయిలు ఇలా చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు.ఇదే విషయమై గతంలో పలుమార్లు అప్రమత్తం చేశాం. అయిన కొందరు ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని, షేర్ చేయొద్దని సజ్జనార్ సూచించారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.






