21 April, 2026 | 1:49 AM

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

21-04-2026 12:00 AM

కోహెడ, ఏప్రిల్ 20: కోహెడ మండలం తంగళ్ళపల్లి మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను  పట్టుకున్నట్లు ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ అభిలాష్ మాట్లాడుతూ..  మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు.

అక్కడ ఇసుక లోడ్ తో ఉన్న ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు చెప్పారు. ఇసుక ను అక్రమంగా రవాణా చేస్తున్న తంగళ్లపల్లి కి చెందిన కొత్తూరి వేంకటేశ పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులకు జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ హెచ్చరించారు.