బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్
16-06-2024 01:00 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా భాద్యతలు చేపట్టారు. ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు కలెక్టర్ కు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, పూజారి గౌతమి తోపాటు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు, మొక్కలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.






