1 July, 2026 | 11:11 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పరిశుభ్రతే ప్రధానం

06-03-2026 08:46 PM

- 56వ డివిజన్లో పారిశుధ్య కార్యక్రమం

- పర్యవేక్షించిన కార్పొరేటర్ శాంతిప్రియ

కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజాపాలనలో కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 56వ డివిజన్ వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలకు నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న కాల్వలను కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. అదే విధంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా శాంతిప్రియ మాట్లాడుతూ... పరిశుభ్రతే ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా కాల్వలను శుభ్రం చేయించడం ద్వారా దోమల బెడద తప్పుతుందని చెప్పారు.

డివిజన్ వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు అనునిత్యం నిర్వహిస్తూ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. డివిజన్లో ఏ సమస్య తలెత్తినా తనను నేరుగా సంప్రదించాలని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ సంధ్య, జవాన్ నవీన్, 56వ డివిజన్ కార్యదర్శి గడ్డం సతీష్ బాబు, రమాదేవి, శారద తదితరులు పాల్గొన్నారు.