2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం

06-03-2026 08:49 PM

చిట్యాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమం ద్వారా మునిసిపాలిటీలో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డులలో నెలకొని ఉన్న పారిశుద్ధ్య, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సమస్యలతో పాటు గత కొద్దిరోజులుగా పెండింగ్లో ఉన్న వివిధ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. 12వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల వెనక కాలనీలో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు.