15 May, 2026 | 1:29 AM

ఊడ్చే చీపుర్ల కోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

15-05-2026 12:25 AM

అబ్దుల్లాపూర్ మెట్, మే 14: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్  నాగోల్ సర్కిల్ పరిధి కుంట్లూరు 51 డివిజన్, పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్ లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు గత 6 నెలలకు నుంచి ఊడ్చే చీపుర్లు ఇవ్వడం లేదని నాగోల్ సర్కిల్ ఆఫీస్ పెద్ద అంబర్ పేట్ లోని డీసీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఊడ్చే చీపుర్ల కోసం పారిశుద్ధ్య కార్మికుల గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

ఏళ్ల తరబడిగా రావాల్సిన కాస్మోటిక్స్ బట్టలు, నూనె వంటి సదుపాయాలతో పాటు, వీధులు ఊడ్చడానికి అవసరమైన చీపుర్లు కూడా ఇవ్వడం లేదని కార్మికులు మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, బకాయి ఉన్న వస్తువులను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ మాట్లాడుతూ.. కష్టపడుతున్న సిబ్బందికి కనీస గుర్తింపు లేదని.. గత ఆరు నెలల నుంచి ఊడ్చే చీపుర్లు ఇవ్వకపోవడంతో కార్మికుల సొంత డబ్బులతో చీపుర్లు కొనుగోలు చేస్తుండ్రు అన్నారు.

వారికి రావాల్సిన వస్తులను వెంటనే మంజూరు చేయాలని లేని పక్షంలో వచ్చే సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జవాన్లకు పెట్రోల్ సౌకర్యాలు ఉన్నప్పటికీ  స్థానికంగా  అందజేస్తాలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మైసయ్య, నర్సింహా, జంగయ్య, జగన్, మైపాల్, మాదవి, పోచమ్మ, సుజాత, సంతోష తదితరు లు పాల్గొన్నారు.