సెంట్రింగ్ కార్మికులకు జీవిత బీమా కల్పించాలి
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, మే 14 (విజయక్రాంతి): భవననిర్మాణ పనులలో సెంట్రింగ్ కార్మికులు ప్రధానపాత్ర పోషిస్తున్నారని వారికి జీవితబీమా సౌకర్యం కల్పించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సెంట్రింగ్ కార్మికులు గురువారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ భవన నిర్మాణల సమ యంలో సెంట్రింగ్ కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, పలు సందర్భాలలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారని, ఆ సమయంలో వారి కుటుంబాలు రో డ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సెంట్రింగ్ కార్మికులకు 10 లక్షల రూపాయల జీవిత బీమా కల్పించాలని, సెంట్రింగ్ మెటీరియల్ దొంగిలించిన, దొంగ మెటీరియల్ కొన్నా, రైల్వేచట్టం ప్రకా రం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో జీహెచ్‌ఎం సీ అధికారు లు కార్మికులతో వ్యవహరించాలని అన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.






