10 April, 2026 | 9:20 PM

చెన్నై సూపర్‌కింగ్స్‌లోకి సంజూ శాంసన్

10-11-2025 12:00 AM

-జడేజా, సామ్ కరన్‌లతో రాజస్థాన్ ట్రేడింగ్

-తుది దశకు చేరిన చర్చలు

ముంబై, నవంబర్ 9 : ఐపీఎల్‌లో చరిత్రలో మరో ఆసక్తికరమైన ట్రేడింగ్ జరగబో తోంది. ఊహించినట్టుగానే రాజస్థాన్ రాయ ల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన ఫ్రాంచైజీని వీడబోతున్నాడు. వచ్చే సీజన్ నుంచి సంజూ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడబోతున్నాడు. మినీ వేలానికి ముందు దీనికి సంబంధించిన ట్రేడింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రెండు ఫ్రాంచైజీల మధ్య చర్చలు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. సంజూకు బదులుగా చెన్నై ఫ్రాంచైజీ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

దీనిపై అధికారిక ప్రకటనే మిగిలిఉంది. దీని పై ప్లేయర్స్ నిర్ణయం కూడా తెలియాల్సి ఉం ది. ఈ డీల్ జరిగితే నిజంగానే పెద్ద సంచలనంగా మారనుంది. ఎందుకంటే జడేజా చెన్నైకి, సంజూ రాజస్థాన్‌కు సుదీర్ఘకాలంగా ఆడుతున్నారు.తమ జట్లలో వీరిద్దరూ మ్యా చ్ విన్నర్లు కూడా. అలాంటి ప్లేయర్స్‌ను ఈ విధంగా ట్రేడ్ చేసుకోవడం ఆయా ఫ్రాంచైజీలకు షాకింగ్‌గానే ఉంది. సీఎస్కేలో ధోనీ తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్‌గా జడేజాకు పేరుంది. చాలాసార్లు చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

మరోవైపు గత సీజన్ నుంచీ సంజూకూ, రాయల్స్‌కు మధ్య వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఫ్రాంచైజీని వీడాలని అతను నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజ మవుతూ ట్రేడింగ్ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా గత సీజన్‌కు ముందు చెన్నై రూ.18 కోట్లతో జడేజాను, రాజస్థాన్ రూ.18 కోట్లతో సంజూను రిటైన్ చేసుకున్నా యి. గతంలో జడేజా 2008, 2009 సీజన్లలో రాజస్థాన్ ఫ్రాంచైజీకి ఆడాడు.