calender_icon.png 11 November, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరాహోరీగా హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్

10-11-2025 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 9 : ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న పికిల్‌బాల్ లీగ్ కు నగరంలోనూ ఆదరణ పెరుగుతోంది. తా జాగా హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ చూసేందుకు సెలబ్రిటీలు, అభిమానులు క్యూ కట్టా రు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, బ్యా డ్మింటన్ స్టార్స్ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వంటి సెలబ్రిటీలు పికిల్‌బాల్ మ్యాచ్‌లకు హాజరై ప్లేయర్స్‌ను ఉత్సాహపరిచారు.

కాగా హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లలో దానోస్ డైనమోస్‌పై క్రెడికాన్ డైనమోస్ విజయం సాధించింది. కీర్తి వారియ ర్స్‌పై రాప్టర్స్ గెలిస్తే.. స్టారీ స్మాషర్స్‌తో మ్యా చ్ తెరమోర్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ పికిల్‌బా ల్ లీగ్ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 13న జరగనుంది.