10-11-2025 12:00:00 AM
మేఘాలయ క్రికెటర్ ప్రపంచ రికార్డ్
సూరత్, నవంబర్ 9: రంజీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు నమోదైంది. మేఘాలయకు చెందిన క్రికెటర్ ఆకాశ్ కుమార్ చౌద రి వరుసగా 8 సిక్సర్లు బాది వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అలాగే 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని రికార్డులకెక్కాడు. సూరత్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఈ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో లీస్టర్‌షైర్‌కు చెం దిన వేన్ వైట్ రికార్డును(12 బంతుల్లో 50) ఆకాశ్ బద్దలుకొట్టాడు. ఆకాశ్ ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదేశాడు.
తర్వాత రెండు బంతులకు కూడా సిక్సర్లు కొట్టాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వరుసగా 8 సిక్స ర్లు బాదిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు.టీ ట్వంటీ ఫార్మాట్‌లో కూడా ఇది అత్యంత అరుదైన ఘనతగా చూస్తారు. అలాంటిది రంజీ ట్రోఫీలో ఇలాంటి విధ్వంసం చూడడం ఇదే తొలిసారి. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా.. ఆకాశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కేవలం 11 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి యువీ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశ్ 14 బంతుల్లో 50 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌ను 628/6 దగ్గర డిక్లేర్ చేసింది. తర్వాత అరుణాచల్‌ప్రదేశ్ కేవలం 73 పరుగులకే కుప్పకూలింది.