15 April, 2026 | 5:49 AM

బీసీ గురుకులంలో సంక్రాంతి వేడుకలు

11-01-2026 12:10 AM

సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ  నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సం దర్భంగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కళాకారుల వేషధారణలతో విద్యార్థులు సంద డి చేశారు. సాంప్రదాయ వస్త్రధారణతో, భోగి మంటలతో పాఠశాల ప్రాంగణమంతా సం క్రాంతి శోభ నిండుకుంది. రంగవల్లులు దిద్దగా చిన్నారులు కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. తదుపరి సంక్రాంతి పండుగ విశిష్టత గురించి పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్ వివరించా రు. కార్యక్రమంలో ఏటిపిలు సంతోష్, సరిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.