calender_icon.png 11 January, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని నిలిపేయాలి

11-01-2026 12:13:06 AM

డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్

సికింద్రాబాద్ జనవరి 10 (విజయక్రాంతి): జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశ చరిత్రకు అవమానం అన్ని కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అమానుషమైన చర్య అని, ఇది బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా తీసుకున్న రాజకీయ నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు.

శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫలమండిలో కాంగ్రెస్ నాయకులు సికింద్రా బాద్ నియోజకవర్గ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ కలిసి మీడియా సమావేశంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సురేష్ లాల్, జగ్గు, జాంగిర్, అనిల్, చక్రధర్, కల్పన, శిల్ప చారి, సందీప్ రాజ్, షకిల్ ఖాన్, అమర్, ఇసాక్, సతీష్, శ్యామ్, జై కుమార్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.