11-01-2026 12:10:34 AM
వెటర్నరీ యూనివర్సిటీ విశ్రాంత సీనియర్ ప్రొ.డా.లక్ష్మణ్
ముషీరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి) : చిన్న గాయంతో మొదలై 50 శాతం శరీరం అంతా వ్యాప్తి చెంది తీవ్ర అస్వస్థత గురై బాధపడుతున్న పెంపుడు కుక్క (గోల్డీ)కు వినూత్నమైన చేప చర్మ అంటుకట్టుట విధానంతో దానికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించడం భారతీయ పశువైద్యంలో ఒక నూతన ఆవిష్కరణ. తెలంగాణలో మొదటి శాస్త్ర ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ వెటర్నరీ డాక్టర్ వెంకట్ యాదవ్, డా.షిరీన్ లు వెల్లడించారు.
నగరంలో ఈసీఐఎల్ కు చెందిన పెట్ సంరక్షకుడు రాఘవ గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో తమను సంప్రదించారని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో వైద్య పరీక్షల చేసి పెట్ ప్రాణాన్ని కాపాడినట్లు వారు తెలిపారు. పెంపుడు జంతువులు మానవుల మాదిరిగానే వైద్య పురోగతి అర్హత కలిగినవని, ప్రక్రియ కేవలం ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా భారతదేశంలో పశువైద్య వైద్యం కోసం కొత్త అవకాశాలను తెరిచినట్లు అని డాక్టర్ వెంకట్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది నివేదిత తదితరులు పాల్గొన్నారు.