calender_icon.png 14 December, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్ విశ్వవిద్యాలయంలో సంస్కృత కోర్సు

13-12-2025 01:35:08 AM

తొలిసారిగా మహాభారతం,భగవద్గీత పాఠ్యాంశాలు

ఇస్లామాబాద్, డిసెంబర్ ౧౨: పాకిస్తాన్ విద్యావ్యవస్థ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదేశంలోనే మొట్టమొదటిసా రిగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సెన్సైస్ యాజమాన్యం వర్సిటీ పరిధి లో సంస్కృత భాషను ఒక అధికారిక కోర్సు ప్రవేశపెట్టింది. కోర్సులో భాగంగా భగవద్గీత, మహాభారతం, రామాయణాన్ని పా ఠ్యాంశాలుగా చేర్చింది. భాషా పండితులు ఇటీవల విద్యార్థుల కోసం ఇక వర్క్‌షాపు నిర్వహించి మరీ కోర్సు గురించి తెలియజెప్పారు.

విద్యార్థుల నుంచి స్పందన రావడం తో వర్సిటీ యాజమాన్యం కోర్సును ఖరారు చేసింది. ౨027 విద్యాసంవత్సరం నుంచి వర్సిటీ పరిధిలో కోర్సు అందుబాటులోకి రానున్నది. ఈ అంశంపై పాకిస్థాన్‌కు చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ షాహిద్ రషీద్ మాట్లాడుతూ.. దక్షిణ ఆసియా తత్వశాస్త్రం, సాహిత్యం, ఆధ్యాత్మిక సంప్రదాయా లకు సంస్కృతం మూలమని, భవిష్యత్ తరాలకు ఆ వారసత్వం అందించాలంటే ఈ భా షపై అధ్యయనం జరగాలని, విద్యార్థులు ఆ భాషలో పట్టభద్రులు కావాలని ఆకాంక్షించారు.

గుర్మానీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ మాట్లాడుతూ.. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో పాకిస్థాన్ నుంచి వందలాది మంది భగవద్గీత, మహాభారత పండి తులు ఉద్భవిస్తారని జోస్యం చెప్పారు. విద్యార్థులు మొదట్లో సంస్కృతం నేర్చుకోవడం కష్టమని భావిస్తారు.. కానీ, తమ ఉర్దూ భాష సంస్కృతం ద్వారా ఎంతగా ప్ర భావితమైందో తెలుసుకుని ఆశ్చర్యపోతారని, ఆ తర్వాత ఇష్టంగా సంస్కృతం నేర్చు కుంటారని ఆకాంక్షించారు.