calender_icon.png 14 December, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు ఎఫ్‌ఓఈలపై వేటు

13-12-2025 01:33:52 AM

  1. విమాన సర్వీసుల కార్యాచరణ పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం
  2. ప్రాథమిక విచారణలో వెల్లడి
  3. డీజీసీఏ కఠిన నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౨: ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యం, అంతరాయ సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరో కఠిన నిర్ణయం తీసుకున్నది. విమాన సర్వీసుల కార్యాచరణ పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారించి నలుగురు ఫ్లుటై ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ల (ఎఫ్‌ఓఈ)ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. డీజీసీఏ అమలు చేసిన కొత్త ‘ఫ్లుటై డ్యూటీ టైమ్ లిమిటేషన్స్’ నిబంధనలకు అనుగుణంగా పైలట్లు, సిబ్బందిని నియమించు కోవడంలో ఇండిగో సంస్థ వైఫల్యం చెందడంతోనే సంక్షోభానికి కారణమని తెలిసింది.

సమస్యలను పరిష్కరించేందుకు డీజీసీఏ సమ్రగ మైన చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగానే గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. మొదటి బృందం రోజువారీ విమాన కార్యకలాపాలు, సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుండగా, రెండో బృందం రీఫండ్, ప్రయాణికుల సామగ్రి అందజేసే పనులను పర్యవేక్షిస్తున్నది.మరోవైపు ఇండిగో పరిధిలో ఆపరేషనల్ సంక్షో భం కొనసాగతూనే ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీ విమానాశ్రయం నుంచి 105 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.