ఒక హెచ్1బీ ఉద్యోగి.. 100 మంది వలసదారులతో సమానం
- కొన్ని కంపెనీలు భారతీయుల్నే నియమించుకుంటున్నాయి..
హెచ్1బీ వీసాదారులను అమెరికా నుంచి వెళ్లగొట్టాలి
రాస్‌ముస్సేన్ సీఈవో మార్క్ మిచెల్ వ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూయార్క్, డిసెంబర్ ౧౨: ‘ఒక హెచ్‌౧బీ ఉద్యోగి 100మంది అక్రమ వలసదారులతో సమానం’ అంటూ అమెరికా వ్యాఖ్యా త, పోలింగ్ కంపెనీ రాస్‌ముస్సేన్ సీఈవో మార్క్ మిచెల్ భారతీయ ఉద్యోగులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షు డు ట్రంప్ సలహాదారు స్టీవ్ బానన్ తాజా గా న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మార్క్ మిచెల్ మాట్లాడతూ..
అమె రికన్ సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న మూ డింట రెండొంతుల మంది విదేశీయులేనని, కొన్ని సంస్థలు ౮౫ నుంచి ౯౫ శాతం వరకు భారతీయులనే నియమించుకుంటున్నాయని నోరుపారేసుకున్నారు.
హెచ్ ౧బీ వీసా కలిగి ఉన్నవారిని ఎందుకు అమెరికా నుంచి వెళ్లగొట్టడం లేదని ప్రశ్నించారు. వారంతా సంపాదించుకుని తమ దేశాలకు వెళ్లిపోతున్నారని, ఇదొక దోపిడీ వ్యవస్థ అని చెప్పుకొ చ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారం రేపు తున్నాయి. మిచెల్ వ్యాఖ్యలు జాత్యాహంకారాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




