16-02-2026 12:00:00 AM
మేడిపల్లి/జవహర్‌నగర్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): బంజారాల ఆరాధ్య దైవం అయిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని మేడిపల్లి బంజారా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. జయంతి సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించి సద్గురు సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాంక్డోత్ రామకోటి నాయక్, భూక్య మణిరామ్ నాయక్, వాంక్డోత్ సురేష్ నాయక్, భీమ్ సింగ్ నాయక్, టిక్యా నాయ క్, శ్రీలత బద్రు నాయక్, మోతిలాల్ నాయ క్, జుమ్మిలాల్ నాయక్, భగవంతు నాయక్, రాజకుమార్ నాయక్, భూక్య హేమని నాయక్, సంజయ్ నాయక్, గుగులోత్ శ్రీను నాయక్, ధనావత్ శ్రీకాంత్ నాయక్, పూజారిగా చందులాల్ నాయక్, సేవాలాల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అంగోత్ తారాసింగ్, కార్యదర్శి భూక్య ప్రవీణ్ రాథోడ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీను, జాయింట్ సెక్రటరీలు మూడవత్ సంజీవ్ చౌహన్, చందర్ నాయక్, ఉపేందర్ నాయక్, పాండు నాయ క్, కోశాధికారి లింగా నాయక్, బంజారా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్
జవహర్‌నగర్ (విజయక్రాంతి): బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాలేనని జవహర్ నగర్ సేవాలాల్ అధ్యక్షుడు అంగోత్ రవి నాయక్ తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఘనంగా సేవలాల్ సమితి ఆధ్వర్యంలో సేవలాల్ మహా రాజ్ 287వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ సేవాలాల్ సంఘం అధ్యక్షుడు అంగోత్ రవి నాయక్ హాజరై మాట్లాడుతూ. సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడిగా బంజారుల జాతి పితగా భావిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బంజారా ఉపా ధ్యక్షులు ఆర్ రాజు నాయక్, ఎల్ రాము లాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఎం చందు నాయక్, ఏం రాజు నాయక్, సంయుక్త కార్యదర్శి ఆర్ శ్రీను నాయక్, ఏ రవీందర్ నాయక్, బి రవీందర్ నాయక్, కోశాధికారి కే చందు నాయక్, ఉమ్మడి కార్యదర్శి బి రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.