17 April, 2026 | 7:13 PM

వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలి

19-06-2025 12:52 AM

అదనపు కలెక్టర్ భాస్కరరావు 

యాదాద్రి భువనగిరి జూన్ 18 ( విజయ క్రాంతి ): వన మహోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని,భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు  తెలిపారు. బుధవారం  రోజు ఆలేరు మున్సిపాలిటీ లో మున్సిపల్ కమీషనర్ తో  కలసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  వర్షాకాలం మొదలైనందున మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని తెలిపారు ప్రజలకు ఉపయోగపడే లాంటి మొక్కలను నాటేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు.  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని ప్రకృతి కి మారు పేరుగా ఉండాలంటే  మనం చెట్లు నాటాలని కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. 

చెట్టు నీడతోపాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను అందిస్తుందని,చెట్టు నీడ వెలకట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లని  ప్రతి ఒక్కరూ చెట్టును నాటి సమాజంలో మార్పు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, మెప్మా రిసోర్స్ పర్సన్స్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.