24 August, 2026 | 11:48 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

ఐదేళ్ల తర్వాత కైలాశ్ మానస సరోవర్ యాత్ర

19-06-2025 12:53 AM

- అధికారికంగా ప్రకటించిన సదరన్ ట్రావెల్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): భారతీయ పర్యాటక రంగం లో నమ్మకానికి, శ్రేష్టతకు పర్యాయపదంగా ఉన్న సదరన్ ట్రావెల్స్, ఐదేండ్ల విరామం తర్వాత కైలాస మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది. కొవిడ్ మహమ్మా రి విజృం భన, భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా 2020లో ఈ తీర్థయాత్రను నిలిపేశారు. భారత్ మధ్య దౌత్యపరమైన ఒప్పందాల తర్వాత, 2025 వేసవిలో యాత్రను తిరిగి ప్రారంభించాలని అంగీకరించాయి.

సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ.. “భారతదేశమంతటా వేలాదిమంది భక్తులకు కైలాస మానససరోవర్ యాత్రను అందుబాటులోకి తీసుకురావడం మాకు గౌరవంగా ఉంది. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, పరివర్తన కలిగించే అనుభవం. లక్షలాది మంది యాత్రికులు కైలాస పర్భాత్ పవిత్ర దర్శనం పొందడానికి చైనా ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహించేందుకు సహాయం చేసిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు.

కైలాశ్ మానస సరోవర్ కోసం సదరన్ ట్రావెల్స్ 3 ప్యాకేజీలను ప్రారంభించింది. ఖాట్మండ్ నుంచి 14 రోజుల ఓవర్‌ల్యాండ్ ప్యాకేజీ, ఖాట్మండు నుంచి హెలీకాప్టర్‌తో 12 రోజుల ప్యాకేజీ, లక్నో నుంచి హెలీకాప్టర్‌తో 10 రోజుల ప్యాకేజీ. ఖాట్మండు, కైరోంగ్, సాగా, మానస సరోవర్ సరస్సు, డార్బెన్, దిరాపుక్, జుతుల్‌పుర్ వంటి పవిత్ర స్థలాలను కవర్ చేస్తూ ఆధ్యాత్మిక మేల్కొలుపు అందించనున్నారు.

శిక్షణ పొందిన సహాయక సిబ్బంది, వైద్య బృందంతో పాటు యాత్రికులకు శాఖాహార భోజనం, రోజువారీ ఆధ్యాత్మిక సెషన్లు, అనుమతికి ఇబ్బంది లేకుండా డాక్యుమెంటేషన్, సౌకర్యవంతమైన ఈఎమ్‌ఐ తదితర సదుపాయా లు కల్పిస్తున్నారు. అమర్నాథ్ యాత్రలో కూడా తమ సేవలను అప్‌గ్రేడ్ చేసినట్టు సదరన్ ట్రావెల్స్ పేర్కొంది.  బుకింగ్ కోసం www.southerntravels.comలో లేదా 98480 23236 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.