1 July, 2026 | 7:07 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

ఏసీబీ తీరు అభ్యంతరకరం

19-06-2025 12:52 AM

-మొబైల్ అప్పగించాలనడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం

-ప్రాథమిక హక్కుల హననమే

-ఏసీబీకి కేటీఆర్ లేఖ

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): అవినీతి నిరోధక శాఖ విచారణ పేరుతో ప్రాథమిక హక్కుల హననానికి పాల్పడుతున్నదని, విచారణ పేరిట వ్యకిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిం చారు. ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న విచారణకు హాజరైన కేటీఆర్‌ను.. తన వ్యక్తిగత మొబైల్‌ను అప్పగించా లని ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం లేఖ ద్వారా ఏసీబీకి సమాధానమి చ్చారు.

విచారణకు హాజరు కావాలని ఈ  నెల 13న తనకు నోటీసులు అందాయని, వాటి ప్రకారం తాను 16న ఏసీబీ కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని గుర్తుచేశారు. విచారణకు పూర్తి సహకారం అందించానని వెల్లడించారు. విచారణ అనంతరం తన మొబైల్స్ ఫోన్స్, ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి గ్యాడ్జెట్స్ అప్పగించాలని ఏసీబీ తనను ఆదేశించిందని, వాటిని ఎందుకు అప్పగించాలనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు.

బీఎన్‌ఎస్ చట్టం 94లో భాగంగా తనకిచ్చిన నోటీసులో వాటి ప్రస్తావన లేదన్నారు. ఈ ఏడా డి మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తాను ఫోన్ కాకుండా మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడలేదని వెల్లడించారు. 

హైడ్రా పేరిట బ్లాక్‌మెయిల్ 

హైడ్రాను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ దందా సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అక్రమంగా కట్టుకున్న ఏ ఒక్క ఇంటి జోలికీ హైడ్రా వెళ్లలేదని, కానీ.. నిరుపేదల ఇళ్లను మాత్రం కూల్చేసిందని మండిపడ్డారు.

బుధవారం ఆయన హైడ్రా కూల్చివేతల్లో నిరాశ్రయుడైన బీఆర్‌ఎస్ బోరబండ డివిజన్ నేత మహ్మద్ సర్దార్‌ను ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. యూపీలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని గొంతు చించుకుంటున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి తెలంగాణలో హైడ్రా కూ ల్చివేతలు పట్టడం లేదా? అని ప్రశ్నించారు.