calender_icon.png 24 January, 2026 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి పూజా మహోత్సవం

24-01-2026 12:43:12 AM

గోషామహల్‌లో నాలుగో ఏడాది నిర్వహణ

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): హైదరాబాద్ గోషామహల్ ప్రాం తంలోని చందన్వాడీ రోడ్డులో ఉన్న హజారి భవన్‌లో మాత సరస్వతి పూజా మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు న్నా రు. వరుసగా నాలుగో సంవత్సరంగా ఈ పూజా వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆళ్ల పురుషోత్తమ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం వైశ్య భవన్ కళ్యాణ మండపంలో అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. భక్తు లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలి సి ఈ పూజా కార్యక్రమాలకు హాజరై మా త సరస్వతి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ పూజా మహోత్సవం ప్రెసిడెంట్ బొమ్మెరల హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ వేలూరు రవీంద్రనాథ్, సెక్రటరీ తెల్లకుంట సందీప్, ట్రెజరర్ బాసెట్టి గోపాల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిర్వహణలో బిమల్ సహరో, జాంటు బేరా, అనంత్‌దాస్, కలిపాద దాని, రాంపాల్ భాయ్, సంజయ్ దత్తా, చందు, సమీర్ సాహు తదితరులు పాల్గొన్నారు.