calender_icon.png 24 January, 2026 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

24-01-2026 12:43:35 AM

* మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

* హెల్మెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మెదక్, జనవరి 23(విజయక్రాంతి): రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆటోనగర్ మీదుగా రాందాస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కలిగించే విధంగా నినాదాలతో పురవీధులు మారుమోగాయి. రాందాస్ చౌరస్తా ఏరియాలో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ నిర్వహించి అనంతరం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ యువత  వేగాన్ని నియంత్రించుకోవాలని, మనిషి జీవితం చాలా విలువైందని అందులో ప్రాణం విలువ వెలకట్టలేనిది అన్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ద్విచక్ర వాహనదారులే ఉన్నారని వాపోయారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, రవాణా శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ కార్యాలయ ఆవరణ దగ్గర ద్విచక్ర వాహనదారులకు ఎమ్మెల్యే హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, సంబంధిత పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.