24-01-2026 12:42:23 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జనవరి 23(విజయక్రాంతి): ఎన్నికల విధులు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎన్నికల విధులు నిర్వహించే ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత ఆర్వో, ఏఆర్వోలతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
మున్సిపాలిటీ ఎన్నికలు చాలా కీలకమైనవని అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు కలిసి 150 పోలింగ్ కేంద్రాలు, 75 వార్డులు ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల సామాగ్రి సేకరించడం ఓటర్ లిస్ట్, బ్యాలెట్ పేపర్ సిద్ధం చేసుకోవడం టెండర్, చాలెంజ్ ఓట్స్, పి ఓ డైరీ అన్ని పత్రాలు నింపడం, పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీలింగ్ కౌంటింగ్ ప్రక్రియ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకం, నియామక పత్రాలు అందించడం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు.