1 September, 2026 | 1:51 AM

కోచ్‌గా సర్పరాజ్‌పై వేటు

01-09-2026 12:59 AM

పాక్ జట్టులో కీలక మార్పులు

లాహోర్, ఆగస్టు 31: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసలో వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో కోచింగ్ సిబ్బం దిలో కీలక మార్పులు చేసింది. వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా ఉన్న మైక్ హసన్ను మూడో టెస్టు కోసం టెస్టు జట్టు బాధ్యతలు నిర్వర్తించాల్సిందిగా పీసీబీ నిర్ణయించింది. రెడ్‌బాల్ కోచ్ సర్పరాజ్ అహ్మద్, సపోర్ట్ స్టాఫ్ ఉమర్ గుల్లను తప్పించారు. పేలవమైన ఫామ్ కారణంగా మహ్మద్ రిజ్వాన్‌ను స్వదేశానికి పంపిస్తున్నట్లు సమాచారం. గాయంకారణం గా ఇమామ్ కూడా జట్టును వీడే అవకాశం ఉంది.

చివరి టెస్టు కోసం సైమ్ ఆయూబ్, మిన్హాస్లతోపాటు ఆరుగురు కొత్త ఆటగాళ్లను పీసీబీ పిలిచింది. 9 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ జట్టుతో కలవనున్నారని ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ డ్రెస్సింగ్ రూంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా బాబర్ గైర్హాజరీలో మొదటి టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను కూడా పీసీబీ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో సల్మాన్ అఘా స్వదేశానికి తిరిగి రానున్నాడు.