స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

15-09-2026 | 10:42pm

రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న సర్పంచ్ కృష్ణాజి 

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీ(Bambara Gram Panchayat) కార్యాలయంలో లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను(smart ration cards) పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన 783 మందికి కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా చూస్తామన్నారు. రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడి సంతోష్, జిపిఓ వసంత్ రావు, గ్రామ కార్యదర్శి ధర్మయ్య, కారో బారి కౌడు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు